News

తెలంగాణ మరో అంతర్జాతీయ ఖ్యాతి


తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన టూరిజం ప్రమోషనల్ మూవీకి అంతర్జాతీయ అవార్డు దక్కింది. తెలంగాణ రాష్ట్రానికి మరో అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. అక్టోబర్ 19 నుంచి 21వరకు పోర్చుగల్‌లో జరిగిన ఫిల్మ్‌ఫెస్టివల్‌లో పర్యాటక శాఖ రూపొందించిన  'వెల్కమ్ టు తెలంగాణ', 'ఎమర్జింగ్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్' అనే రెండు ప్రమోషనల్ చిత్రాలు ఎంపికయ్యాయి. తెలంగాణ ఎమర్జింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ డెస్టినేషన్ చిత్రానికి మొదటి బహుమతి లభించింది. ఈ సందర్భంగా దర్శకుడు దూలం సత్యనారాయణను మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు.